FbTelugu

దివాకర్ ట్రావెల్స్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

అమరావతి: దివాకర్ ట్రావెల్స్ కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగేశ్వరరెడ్డి, రమేష్, సోమశేఖర్ అనే ముగ్గురు వ్యక్తులు జేసీ ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు తాడిపత్రిలోని బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా నకిలీ పత్రాలు సృష్టించి స్టేట్ మెంట్ ఇచ్చారు.

కాగా నిందితుల నుంచి పోలీసులు పలు కీలక పత్రాలను స్వధీనం చేసుకున్నారు. ఇవాళ ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డిలను విచారణ చేపట్టారు.

You might also like