FbTelugu

మూడు విమానాశ్రయాలు ‘‘అదానీ’’ పరం

ఢిల్లీ: తిరువనంతపురం, జైపూర్, గౌహతి విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేశారు. ఈ మూడు విమానాశ్రయాలను లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మూడు విమానాశ్రయాల నిర్వహణ, ఆపరేషన్, అభివృద్ద కోసం ఏయిర్ పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా గ్లోబల్ విధానంలో బిడ్డింగ్ నిర్వహించగా అదానీ గ్రూప్ దక్కించుకున్నది. దీంతో అదానీ కి అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. అర శతాబ్ధం (50 సంవత్సరాలు) లీజు ప్రాతిపదికన అప్పగించనున్నారు.

You might also like