FbTelugu

పోటీకి సిద్ధమైన ముగ్గురు నటులు

చెన్నై: త్వరలో జరనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు నటీనటులు సిద్ధమవుతున్నారు. ఈసారి అధిక సంఖ్యలో పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్ ముందుగానే ప్రచారానికి బయలుదేరారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆయన ప్రచారం మొదలుపెట్టారు. డీఎంకే నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన కుష్భూ కూడా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ ఆదేశిస్తే రంగంలోకి దిగడానికి సై అంటూ సంకేతాలు పంపించింది. అన్నా డీఎంకే నుంచి సినీ నటి వింధ్య కూడా చెన్నై నగరం నుంచే పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు.

చెన్నై నగరంలో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఉబలాటపడుతుండం పలు పార్టీలకు చిక్కులు తెచ్చే విధంగా ఉన్నాయి. మైలాపూర్ నియోజకవర్గం నుంచి కమల్ హాసన్ పోటీ చేస్తున్నారు. గత లోకసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి అధికంగా ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో కమల్ మైలాపూర్ ను ఎంపిక చేసుకున్నారు. కుష్భూ చేపాక్ ట్రిప్లకేన్ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. వింధ్యను ఆర్.కె.నగర్ నియోజకవర్గం నుంచి దించేందుకు అన్నా డీఎంకే సంకేతాలు పంపించింది. ఇదే నియోజకర్గం నుంచి శశికళ నటరాజన్ మేనల్లుడు గత ఎన్నికల్లో నిలబడి గెలుపొందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.