FbTelugu

మళ్లీ ముంచుకొస్తున్న మిడతల ముప్పు

ఢిల్లీ: దేశంలో ఓ పక్క కరోనాతో ప్రజలు విలవిలలాడుతుంటే మరో పక్క మిడతల దండు మరోసారి దండయాత్ర ప్రారంభించాయి. గత కొన్ని రోజులుగా స్తబ్దంగా ఉన్న మిడతలు తాజాగా మళ్లీ ఢిల్లీ సమీపంలో ప్రత్యక్షం అయినాయి.

ఈ మిడతల దండు పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. గతంలో వచ్చిన మిడతల దండు పాకిస్థాన్ లో గుడ్లు పెట్టడంతో తాజాగా అవి మిడతలుగా మారి వచ్చినట్టు భావిస్తున్నారు. విమానాలు ఎగిరే సమయంలో, దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెట్లు, మిద్దెలపై లక్షలాది మిడతలు తిష్ట వేస్తున్నట్టు గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.