FbTelugu

జడ్జీలకు వేల వేల వందనాలు: అయ్యన్న

అమరావతి: న్యాయం, ధర్మాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని టీడీపీ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో నియంత అయిన సీఎం జగన్ రెడ్డి చెంపచెల్లుమందన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులతో ఇకనైనా బుద్ధి తెచ్చుకుని కళ్లుతెరిచి మంచి పరిపాలన చేయాలని హితవు పలికారు.

ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గింపు దస్త్రంపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కళ్లు మూసుకుని సంతకం చేశారన్నారు. రానున్న రోజుల్లో అయినా గవర్నర్ దస్త్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్రాన్ని పాలించటం జైళ్లో ఉన్నంత తేలిక కాదన్నది జగన్ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కక్షసాధింపులు ఇకనైనా మాని దౌర్జన్యాలు వీడి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తే అందరికీ మంచిదన్నారు. బంధువు అయిన వైవీ.సుబ్బారెడ్డి, ఏ2 విజయ సాయి రెడ్డి ఆగడాలు మితిమీరాయని గ్రహించాలన్నారు. వీరిద్దరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని తెలిసి కూడా మాట్లాడటంలేదంటే జగన్ ప్రోత్సాహం ఉందని స్పష్టమవుతోందని అయ్యన్న పాత్రుడు అన్నారు.

You might also like