FbTelugu

పేదరికంలోకి వెయ్యి మిలియన్ల ప్రజలు: యూఎన్‌డీపీ

యావత్ ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రభావం పడని వారుండరంటే అతిశయోక్తి కాదనే చెప్పవచ్చు. ఏడాది నుంచి ప్రపంచ వ్యాప్తంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ మహమ్మారి కారణంగా సుమారు 1,000 మిలియన్ల (వందకోట్లు) ప్రజలు కటిక పేదరికంలోకి నెట్టబడే అవకాశం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ప్రజలు కటిక పేదరికంలోకి జారుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే పేదరికంలో ఉన్నవారిని కలుపుకుంటే 2030 నాటికి ఈ సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభ ప్రభావం మరో పదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అయిదే ప్రభుత్వాలు పటిష్ట నిర్ణయాలతో వీటిని కొంతవరకు తగ్గించే అవకాశం ఉందని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.