FbTelugu

మాస్క్ లేకపోతే రూ.1వేయి జరిమానా

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాస్క్ ధరించే విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన నిర్ణయం తీసుకున్నది. మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా తిరిగే వారిపై రూ.1000 చొప్పున జరిమానా వసూలు చేయనున్నారు.

తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేష్ కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లను ఆయన ఆదేశించారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో కేసుల ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. లాక్ డౌన్ విధిస్తే ప్రజా జీవనం చిన్నాభిన్నం అవుతుందనే ఉద్దేశంతో మాస్కులు, భౌతిక దూరం పై చర్యలు చేపట్టింది.
అలాగే పబ్బులు, బార్లు, థియేటర్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, నియంత్రణ విధించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. వీటిపై కూడా త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.