FbTelugu

ఆ దృశ్యాలు నన్ను కదలించివేశాయి: విజయ్ దేవరకొండ

హైదరాబాద్: విజయ్ దేవరకొండ కథానాయకునిగా, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘‘లైగర్’’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను చిత్ర బృందం నిన్న విడుదల చేసింది. టైటిల్ పై సోషల్ మీడియాలో వస్తున్న స్పందన చూసి విజయ్ దేవరకొండ భావోద్వేగానికి గురైనారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు తనని కదలించివేశాయని అన్నారు. ఓ సమయంలో ఈ సినిమా కోసం తాను పడిన శ్రమను ఎవరైనా గుర్తిస్తారా… అసలు, థియేటర్లకు జనాలు వస్తారా ? అని భావించానని అన్నారు. కానీ స్పందన అద్భుతంగా ఉందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.