FbTelugu

ఆ డాక్టర్ డిగ్రీలు చెత్తబుట్టలోకే…

ఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ల పట్టాలు భారత్ లో చెల్లుబాటు కావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడి డాక్టర్ పట్టాలకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసింది.

పీఓకే వైద్య విద్య పట్టాలపై ఇవాళ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు అక్కడి కళాశాలలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవలేదన్నారు. వారికి కూడా ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని మెడికల్ కౌన్సిల్ సెక్రెటరీ జనరల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇండియాలో డాక్టర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

You might also like