FbTelugu

ఈ ఏడాది ఒలింపిక్స్ వాయిదా

టోక్యో: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం టోక్యో ఒలింపిక్స్-2020 పై కూడా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగనున్న టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేశారు.

దీనిపై జపాన్ ప్రధాని షింజో అబే సైతం వాయిదా పడే అవకాశమే ఉందని ఇంతకి ముందే తెలిపారు. గత వారం పది రోజులుగా ఒలంపిక్స్ నిర్వహణపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇవాళ ఒలంపిక్ నిర్వహణపై ఒలింపిక్స్ అసోసియేషన్ తుది ప్రకటన చేసింది. 124 ఏళ్ల ఒలంపిక్ చరిత్రలో 1916, 1940, 1944 లో ప్రపంచ యుద్దాల సందర్భంగా రద్దుచేశారు. శీతల పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో 1980 లో మాస్కోలో, లాస్ ఏంజెల్స్ లో 1984 లో నిర్వహించ లేకపోయారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More