FbTelugu

ఈసారి వినాయక చవితి ఇంటి పండగే

అమరావతి: కరోనా దృష్ట్యా వినాయక చవితి నవరాత్రుల పండుగను ఇంట్లోనే జరపుకోవాలని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇంట్లోనే పూజలు చేసుకోవాలని కోరింది.

గణేష్ మండపాలకు అనుమతులు లేవని, పూజసామాగ్రి కొనుగోలు ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించింది. దేవాలయాల్లో కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. మార్గదర్శకాలు జారీ చేసే ముందు ప్రభుత్వం తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పరిశీలించింది.

You might also like