FbTelugu

ఈ సమాజం నర్సులకు రుణపడి ఉంది: చంద్రబాబు

కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న నర్సులు, వైద్య సిబ్బందిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ‘‘సేవాభావానికి ప్రతిరూపం నర్సులు, వైద్య సిబ్బంది. బాధిత రోగులకు వేళ తప్పకుండా మందులతో పాటు ఆత్మీయంగా సేవలు అందించే నర్సులు కదిలే ధవళ దేవతలు.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నర్సులు ప్రాణాలకు తెగించి మరీ సేవలందిస్తున్న తీరు ప్రశంసనీయం. అందుకు ఈ సమాజం వారికెంతో రుణపడి ఉంటుంది. తన అద్వితీయ సేవలతో నర్సు వృత్తికి ఎంతో గౌరవాన్ని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అంకితభావంతో పేషంట్లకు సేవలందిస్తోన్న నర్సులందరికీ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతాభినందనలు’’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

You might also like