FbTelugu

పాము పగ అంటే ఇదేనేమో!

చిత్తూరు: రెక్కలు ఆడితే కాని డొక్క ఆడని బతుకు ఆయనది. అయినా విష సర్పాలు పగబట్టినట్లు ప్రతి ఏడాది అతన్ని కాటేస్తాయి. అది కూడా కుడి చేయి లేదా కుడి కాలుపై మాత్రమే కాటు వేస్తుంది.

జీవిత కాలంలో రెండు లేదా మూడు సార్లు పాము కాటేస్తుంది కాని పుట్టిన దగ్గర నుంచి 37 సార్లు కాటేయడం ఎక్కడా చూడలేదు. బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట పంచాయతీ కురవూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (42) ను ఇప్పటి వరకు 37 సార్లు పాములు కాటేశాయి. వ్యవసాయ పనులకు వెళ్లే సుబ్రహ్మణ్యానికి తొలిసారి ఐదో తరగతి చదువు తుండగా పొలం వద్ద కాటుపడింది. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కాటేస్తునే ఉన్నాయి.

ఇప్పటి వరకు 37 ఏళ్లలో 37సార్లు పాము కాటేయడం మూలంగా ప్రతిసారి రూ.10వేల వరకు ఖర్చు వస్తున్నది. దినసరి కూలీ కావడంతో ఈ వ్యయం భరించడం కష్టంగా ఉందని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగు రోజుల క్రితం కాటేయడంతో శంకర్రాయలపేట జేఎంజే ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.