FbTelugu

విండీస్‌తో టీమిండియా జట్టు ఇదే

కోల్‌కతా : వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ 20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. స్వదేశంలో ఈ సిరీస్ జరగనుంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సెలక్షన్‌ కమిటీ కోల్‌కతాలో సమావేశమై జట్టును ప్రకటించింది.టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లి విండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడనున్నాడు. అలాగే బంగ్లాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌శర్మ, ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌లు ఆడనున్నారు. స్వింగ్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ పునారగమనం చేశాడు. తాజాగా ప్రకటించిన వన్డే, టీ20 జట్టు వివరాలు..

టీమిండియా వన్డే జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌,

టీమిండియా టీ20 జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌

You might also like