FbTelugu

కరోనా 2డిజి ధర నిర్ణయించారు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తో పోరాడుతూ… ఆక్సిజన్ అందక విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారికి ఉపయోగించేందుకు డి.ఆర్.డి.ఓ తయారు చేసిన 1 డియాక్సీ గ్లూకోజ్ (2డిజి) ఔషధాన్ని ఇటీవలే కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, డాక్టర్ హర్షవర్ధన్ లు ఆవిష్కరించారు.

అయితే ధరలను మాత్రం ఈరోజు ఖరారు చేశారు. బహిరంగ మార్కెట్ లో ఒక్క సాచెట్ ధర రూ.990 గా నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ కు మాత్రం తక్కువ ధరకు ఇవ్వనున్నారు. ఆక్సిజన్ అవసరమైన బాధితులు వేగంగా కోలుకునేందుకు 2డిజిని వినియోగించనున్నారు. నీటిలో కలుపుకుని తాగేలా ఉణ్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిజిసిఐ) అనుమతించింది. ఈ నెల 17న తొలి విడతగా 10వేల సాచెట్లను, 27వ తేదీన మరో 10 వేల సాచెట్లను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మర్కెట్ లోకి విడుదల చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.