FbTelugu

ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఇదే

హైదరాబాద్: మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల బరిలో దిగేవారు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా నాలుగు వర్గాలు బరిలో దిగుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణి జీవితా రాజశేఖర్, నటి హిమ ప్యానెళ్లు పోటీ చేయనున్నాయి. ప్రకాశ్ రాజ్ అందరికన్నా ముందుగానే తన ప్యానెల్ ను ప్రకటించారు. 27 మంది తో విడుదల చేసిన జాబితాలో జయసుధ, శ్రీకాంత్, సాయి కుమార్, అనసూయ, సుధ, బ్రహ్మాజీ, ఉత్తేజ్, బండ్ల గణేష్, అజయ్ ఉన్నారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, మా శ్రేయస్సు దృష్ట్యా నిర్మాణాత్మక ఆలోచనలు ఆచరణలో పెట్టనున్నట్లు తెలిపారు. మన నటీనటుల బాగోగుల కోసం టీమ్ తో మీ ముందుకు వస్తున్నామని ఆయన అన్నారు.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు…
ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, సాయికుమార్, ప్రగతి, బెనర్జీ, తనీష్, అనసూయ, అనితా చౌదరి, సన, అజయ్, సుధ, నాగినీడు, రవిప్రకాశ్, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, ఉత్తేజ్, శివారెడ్డి, ఏడిద శ్రీరామ్, భూపాల్, టార్జాన్, సురేష్, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావు.

You might also like

Leave A Reply

Your email address will not be published.