FbTelugu

వర్మ వైరస్ చిత్రం ఇదే!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినీ ప్రేక్షకుల మతులు పోయేలా ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ సినిమా దిగ్విజయంగా తీసినట్లు ప్రకటించారు.

లాక్ డౌన్ కాలంలోనే చిత్రీకరణ, డబ్బింగ్, ఎడిటింగ్ పూర్తి చేశారు. కరోనా వైరస్ వెరైటీ సబ్జెక్టుపై ప్రపంచంలోనే తొలి సినిమా తీసినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో తమ చిత్రంలోని నటీనటులు, సిబ్బంది సృజనాత్మకత చాటుకున్నారని, వారి క్రియేటివిటీకి లాక్ డౌన్ లేకుండాపోయిందని ఆయన  చమత్కరించారు. ఈ చిత్రం ట్రైలర్ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుందని వర్మ ట్వీట్ చేశారు.

అయితే ఈ సినిమాలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏలుబడిలో భౌతికదూరం (ఫిజికల్ డిస్టాన్స్) ఇలా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఈ ఇమేజీలో దంపతులు పడక గదిలో కూడా మాస్కులు ధరించి దూరంగా కూర్చుని ఉండడం చూడొచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.