FbTelugu

దశాబ్ద కాలంలో ఇదే అత్యధిక వర్షపాతం

హైదరాబాద్ : గత పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ లేనంతగా.. ఈ ఏడాది ఆగస్టులో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు నమోదైనాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు వెల్లడించారు.

కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 27 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. 2018 ఆగస్టు 12న రామగుండంలో 26.5 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. రుతుపవనాలకు తోడూ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు నమోదైనాయి.

You might also like