FbTelugu

అయోధ్య ఆహ్వాన లేఖ ఇదే…

లక్నో: అయోధ్యలో రామాలయం భూమి పూజ కోసం ఆహ్వానితులకు రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు పేరు పేరునా ఆహ్వాన పత్రికలను పంపించింది. పసుపు వర్ణంతో కూడిన లేఖలో హిందీ భాషలో ప్రధాని నరేంద్ర మోదీ రాక సమాచారాన్ని తెలియచేశారు.

ఈ మహాఘట్టానికి హాజరయ్యే వారు అయోధ్య కు 4వ తేదీ సాయంత్రమే చేరుకోవాలని అతిథులను కోరింది. 5వ తేదీన భూమి పూజ ఉండడంతో అదేరోజు ఉదయం ప్రధాని మోదీ సాకేత్ కాలేజీ చేరుకుంటారు. అక్కడి నుంచి హనుమాన్ గార్హి ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

You might also like