FbTelugu

ఇది మోదీ అహంకారమే: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో రైతుల పట్ల మోదీ అహంకారంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల పట్ల గత రెండ్రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.. వారిపై పలు చోట్ల పోలీసులు, కేంద్ర బలగాలు లాఠీచార్జ్ చేయడం పట్ల రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

ట్విట్టర్ వేదికగా.. ఓ జవాను ముసలి రైతును కొడుతున్న ఓ ఫొటోను షేర్ చేసి మోదీపై విరుచుకు పడ్డారు. ఇది చాలా విచారకరమైన ఫోటో అని, తమ నినాదం ‘జై జవాన్ జై కిసాన్’ అని.. కానీ ఈ రోజు ప్రధాని మోదీ అహంకారం జవాన్ రైతుకు వ్యతిరేకంగా నిలబడటానికి కారణమైందన్నారు. ఇలాంటి చర్యలు చాలా ప్రమాదకరమన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.