అమరావతి: టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేయడాన్ని టీడీపీ సీనీయర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్రంగా ద్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అచ్చెన్నాయుడు అరెస్టు రాక్షస పాలనలో జరిగిన మరోఅరాచకమని అన్నారు. ఎదుగుతున్న బీసీ నాయకులను అణచివేసేందుకు కుట్రపన్నుతున్నారని అన్నారు. దీనిని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాలని కోరారు. అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.