FbTelugu

ఈ అభివృద్ధి విధ్వంసానికి బాట

కేదార్‌నాథ్‌లో 2013 సంవత్సరం వరదల విలయతాండవం చోటుచేసుకున్న తర్వాత, 11 వేల అడుగుల కంటే ఎత్తులో ఉన్న పూడిపోయిన ఆలయ గర్భగుడి పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. సుప్రసిద్ధ భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్‌ నవీన్‌ జుయల్‌ ఆలయ పునర్మిర్మాణంపై తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణం, పెద్దమొత్తంలో సిమెంట్‌ లేక ఇనుమును ఉపయోగిస్తే కేదార్‌నాథ్‌ పరిసరాల్లో భవిష్యత్తులో మరిన్ని విపత్తులు చెలరేగుతాయని హెచ్చరించారు. వేసవిలో మంచు కరిగేటప్పుడు భూ ఉపరితలానికి పైనున్న నేల కిందికి జారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కానీ పర్యావరణ హెచ్చరికలపై, శాస్త్రీయ వాదనలపై దృష్టి సారించడానికి బదులుగా ఎన్నికల్లో గెలుపు కోసం పరుగుపందెమే ఇప్పుడు ముఖ్యమవుతోంది. కేదార్‌నాథ్‌లో డాక్టర్‌ జుయల్, ఇతర నిపుణులు పర్యటనలు ప్రారంభిస్తున్నప్పుడు, కేదార్‌నాథ్, ఉత్తరాఖండ్‌ కొండల చుట్టూ వెల్లువగా ప్రకృతి విపత్తుల ఘటనలు పెరుగుతూ వచ్చాయి. అక్కడ నిర్మాణపనులు పెరిగినప్పుడే విపత్తులు కూడా పెరగడం కాకతాళీయంగా కొట్టిపారేయలేం. ఈ ఒక్క ఏడాదిలోనే ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విపత్తుల కారణంగా 250 మంది ప్రజలు చనిపోయారు. పైగా ఇవి కలిగించిన ఆర్థిక నష్టాలు తక్కువేమీ కాదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.