FbTelugu

అంజనేయ స్వామి జన్మస్థలం తిరుమల

తిరుమల: శ్రీరామ నవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీరాముడి ప్రియ భక్తుడు ఆంజనేయ స్వామిపై గొప్ప ప్రకటన చేసింది. తిరుమల గిరుల్లో అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థానం అని వెల్లడించింది.

అంజనాదేవి తపస్సు ఫలితంగా వాయుదేవుడి ఆశీర్వాదంతో తిరుమల గిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలం అని ఆధారాలతో సహా నిరూపితమైందని టిటిడి ప్రకటించింది. ఆంజనేయ స్వామి జన్మస్థలం తెలుసుకునేందుకు గత ఏడాది ఒక కమిటీ వారు. ఈ కమిటీలో మురళీధర శర్మ, రాణి సదాశివమూర్తి, రామకృష్ణ ఉన్నారు. పలుమార్లు ఈ కమిటీ సభ్యులు సమావేశమై పరిశోధనలు గ్రంధాలు, పురాణాలు, ఇతిహాసాలు, జియోగ్రఫీ పరిశీలించారు. అన్నింటిని పరిశీలించి నిర్థారణ చేసుకున్న తరువాత ఆంజనేయ స్వామి జన్మస్థలం తిరుమల గిరే అని ధృవీకరించుకున్నారు. శ్రీరాముడి కి అత్యంత ప్రియ భక్తుడు ఆంజనేయుడి జన్మస్థలం తిరుమలి గిరి అని శ్రీరామ నవమి రోజే ప్రకటించడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.