FbTelugu

తిరుమలకు రూ.700 కోట్లు నష్టం

తిరుమల: లాక్‌డౌన్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సుమారు రూ. 700 కోట్ల ఆదాయాన్ని నష్టపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతుండడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

తిరుమలలో మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. ఈ నెలాఖరు వరకు కొనసాగే పరిస్థితి ఉంది. మార్చి 23వ తేదీ నుంచి నుంచి ఇప్పటి వరకు టీటీడీ ఎంత మేర ఆదాయాన్ని కోల్పోయి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. టీటీడీకి క్రమం తప్పకుండా వచ్చే ఆదాయంలో శ్రీవారి హుండీతో పాటు ఇతరత్రా మార్గాల్లో వచ్చే ఆదాయాలు అనేకం ఉన్నాయి. భక్తుల రాకపోకలు పూర్తిగా నిల్చిపోవడం, దర్శనాలు లేకపోవడంతో అన్ని రకాల ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి.

You might also like