FbTelugu

థర్డ్ వేవ్ ఎఫెక్ట్ మూడున్నర నెలలు!:ఎస్.బి.ఐ

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ పరిణామాలు, థర్డ్ వేవ్ అక్కడక్కడ ప్రారంభం కావడంతో ఇండియాలో అప్పుడే అంచనాలు వేస్తున్నారు. థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత వరకు ఉంటుందనే దానిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) స్పష్టతకు వచ్చింది.

ఈ మేరకు దేశ ఆర్థిక పరిస్థితిపై ఎస్.బి.ఐ ఇకోరాప్ పేరిట తాజాగా నివేదిక విడుదల చేసింది. దేశంలో థర్డ్ వేవ్ 108 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొంది. కేసులు ఎలా ఉంటాయంటే సెకండ్ వేవ్ తో పోల్చితే థర్డ్ వేవ్ లో 1.8 రెట్లు అధికంగా ఉండొచ్చని చెప్పింది. ఇతర దేశాల్లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే సెకండ్ వేవ్ కన్నా థర్డ్ వేవ్ తీవ్రంగా ఉండనుంది. మున్ముందు చిన్నారులకు ప్రమాదం ఉన్నందున వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు 17 కోట్ల వరకు ఉన్నట్లు జనాభా లెక్కలు చెబుతున్నాయి. అగ్రదేశాల మాదిరి వ్యాక్సిన్లు సమకూర్చుకుని యుద్ధప్రాతిపదికన ఇవ్వాలని ఇకోరాప్ నివేదిక వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.