FbTelugu

సొంత టీమ్ పై దుష్ప్రచారం!

కొలంబో: కొన్ని సందర్భాల్లో అభిమానులు వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తారు. వరల్డ్ కప్ లాంటి పోటీల్లో ఓటమి పాలైన సందర్భాల్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు సభ్యులు తమ దేశం వెళ్లకుండా దాక్కునేవారు.
అలాంటి పరిస్థితి కాకపోయినా కాస్త అటుఇటుగా ఇలాంటి వ్యతిరేకతనే శ్రీలంక జట్టు సభ్యులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ఓటమిని శ్రీలంక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సౌథాంఫ్టన్ లో జరిగిన మూడో టి20లో 89 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

శ్రీలంక టీమ్ అంటే ఒకప్పుడు వరల్డ్ ఛాంపియన్, చిన్నదేశమే అయినా కొన్నాళ్ల పాటు ప్రపంచ క్రికెట్ మహారాజుగా వెలుగొందింది. అయితే ఇప్పుడు చెప్పుకోదగిన ఆటగాళ్లు లేనప్పటికీ వరుస అపజయాలు వీరికి శాపంగా పరిణమించాయి. వరుసగా ఐదో టి20 సిరీస్ లో ఓటమి పాలు కావడంతో దేశ అభిమానుల సహనం నశించింది. అపజయాల టీమ్ సభ్యులకు వ్యతిరేకంగా ప్రచారం శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో క్రికెటర్లను అన్ ఫాలో కావాలన్నదే ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశం. ఆదివారం నాడు #unfollowcricketers హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. వేలాది మంది అభిమానులు వైస్ కెప్టెన్ కుశల్, ఓపెనర్ ధనుష్క ఫేస్ బుక్ పేజీలను అన్ పాలో చేశారు. మన్ముందు మరింత తీవ్రతరం చేసి అన్ ఫాలో అవుతామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.