FbTelugu

మూడో దశ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ షురూ

న్యూఢిల్లీ: దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా ఇవ్వాళ్టి నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన వారంతా తమ పేర్లను కొవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్‌ తర్వాత వ్యాక్సిన్ వేయించుకునేందుకు తేదీ ఎంపిక చేసుకోవచ్చు. అదే విధంగా తేదీలు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి లాగిన్‌ అయితే కుటుంబం లేదా బంధువులు నలుగురు అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ల ఉత్పత్తి, డిమాండ్, రెండో డోసు వేసుకోవాల్సిన వారు ఉండడంతో కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.