FbTelugu

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ షురూ…

ఢిల్లీ: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాత్మక పరిశీలన వచ్చే వారం ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలోని పూణేలోని సాసున్ జనరల్ హాస్పిటల్ లో వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నారు.

హాస్పిటల్ డీన్ డా.మురళీధర్ తంబే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కోవిషీల్డ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వచ్చేవారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి మొదలుపెట్టాలని అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి కే వలంటీర్లు ముందుకు వచ్చారని, సుమారు 150 నుంచి 200 మంది వరకు వ్యాక్సిన్లు ఇస్తామన్నారు.
ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో సిరం ఇనిస్టి ట్యూట్ ఆప్ ఇండియా డెవలప్ చేసి, పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని మూడో దశలోకి ప్రవేశించే సమయంలో తాత్కిలిక బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీన్ని తీసుకున్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురి కావడంతో మూడో దశ ను నిలిపివేశారు. ఇతర ఆరోగ్య కారణాల మూలంగా అస్వస్థతకు గురైనట్లు తేలడంతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం అనుమతించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.