FbTelugu

సినీ కార్మికులకు మూడో విడత సాయం: చిరంజీవి

హైదరాబాద్: సినీ కార్మికులకు మూడోసారి సాయం త్వరలో అందించనున్నట్లు సినీ హీరో కొణిదెల చిరంజీవి ప్రకటించారు. నిత్యావసర సరకుల పంపిణీ ఇప్పటికే ప్రారంభించామని ఆయన వెల్లడించారు.

లాక్ డౌన్ ఇప్పటి వరకు పనులు లేక సినీ కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లు నిర్వహించలేని పరిస్థితి నెలకొనడమే కాకుండా సినిమా థియేటర్లను కూడా తెరవడం లేదు. సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేశారు. సీసీసీ ద్వారా ఇప్పటికే రెండు విడతల్లో పదివేల మంది కార్మికులకు సహాయం చేశారు.

మీ కుటుంబాలతో జాగ్రత్తగా ఉండండి, క్లిష్ట పరిస్థితుల నుంచి త్వరలో గట్టెక్కాలని, మళ్లీ యధావిధిగా పనులు చేసుకునే రోజులు రావాలని గణేషుడిని ప్రార్థించాలని చిరంజీవి కోరారు.

You might also like