FbTelugu

లాక్ డౌన్ తో మూడోరోజు తగ్గిన కేసులు

న్యూఢిల్లీ: పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల మూడు రోజులుగాకొనసాగుతున్నది. అదే స్థాయిలో యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. అయితే కరోనా బాధిత మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,11,170 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,077 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 2,70,284గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 18,22,20,164 మాత్రమే. దేశంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే కనీసం ఏడాది సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.