FbTelugu

ఆస్తుల వేలంపై ఆలోచిస్తాం: సుబ్బారెడ్డి

తాడేపల్లి: టీటీడీకి ఎనిమిది రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నాయని, వాటిని సంరక్షించడం కష్టతరంగా మారిందని టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.

ఆస్తుల వేలంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ తిరుమలలో మీడియాతో మాట్లాడారు. వచ్చే పాలక మండలి సమావేశంలో వివాదాస్పదంగా మారిన తమిళనాడు ఆస్తుల వేలంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భూముల వేలంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఎస్టేట్ విభాగంలో తగిన సిబ్బంది లేకపోవడం, ఆస్తుల పరిరక్షణ తలకు మించిన భారంగా మారడంతో విక్రయించాలని నిర్ణయించామని అన్నారు.

అన్యాక్రాంతం కాకుండా నిరర్థక  ఆస్తులను విక్రయించడం కొత్త కాదన్నారు. తమిళనాడులో ఆస్తుల వేలంపై రెండు కమిటీలు వేశామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వేలం వేయాలంటే ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

తమిళనాడుతో పాటు మిగతా ప్రాంతాల్లో కేవలం రూ.1.53 కోట్ల విలువైన నిరుపయోగ ఆస్తులను విక్రయిస్తున్నామని వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. రెండు రోజులుగా తనపై వస్తున్న వార్తలు బాధాకరం అని అన్నారు. రాజకీయ వ్యతిరేకతతోనే మాపై నిందలు వేస్తున్నారు. 1974 నుంచి 2014 వరకు ఆస్తులను వేలం వేశారని ఆయన గుర్తు చేశారు. గత పాలక మండలి కూడా ఇవే ఆస్తులను విక్రయించాలని తీర్మానం చేశాయని సుబ్బారెడ్డి అన్నారు.

You might also like