FbTelugu

క‌రోనాతో దొంగాట‌!

ఏం జ‌రుగుతుంది.. ఐదునెల‌ల క్రితం చైనాలో క‌రోనా వైర‌స్‌తో జ‌నం ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బ‌య‌ట‌కు వ‌చ్చినా ప్లాస్టిక్ క‌వ‌ర్లు కప్పుకుని బిక్కుబిక్కుమంటూ బ‌తుకుతుంటే.. ఇండియాలో ఉన్న మ‌నం సానుభూతి కురిపించాం.

పాపం చైనీయులంటే క‌న్నీరు కార్చాం.. కానీ ఇప్పుడు అదే క‌న్నీళ్లు మ‌న‌కోసం మ‌నం దార‌పోసుకోవాల్సి వ‌స్తుంది.. వేల నుంచి ల‌క్ష‌ల్లోకి కేసులు చేరాయి. ఢిల్లీ, ముంబ‌యి, హైద‌రాబాద్‌, అహ్మ‌దాబాద్ వంటి న‌గ‌రాలు వ‌ణ‌కిపోతున్నాయి. వంద‌ల సంఖ్య‌లో రోజూ న‌మోద‌వుతున్న కేసుల‌తో ఎటూపాలుపోక దిక్కులు చూస్తున్నాయి ప్ర‌భుత్వాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కాస్త బెట‌ర్ అనే చెప్పాలి. అక్క‌డ కేవ‌లం గుంటూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ న‌గరాల‌కే వైర‌స్ ప‌రిమిత‌మైంది. అయినా జ‌నాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు కావ‌టం.. మ‌ర‌ణాల రేటు కూడా క్ర‌మంగా పెర‌గ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌లు జ‌రుపుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తేసిన‌ట్టు గానే ప‌రిస్థితులు మారాయి. మొద‌ట అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల నుంచి ఆర్టీసీ బ‌స్సులు.. షాపింగ్ మాల్స్‌.. నేడోరేపో.. బ‌డులు, సినిమా థియేట‌ర్లు.. మ‌రి ఇంకెక్క‌డ వైర‌స్‌కు అడ్డుక‌ట్ట వేసేది. పైగా సీసీఎంబీ ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌ల‌తో చైనా, అమెరికా, యూకే, ఇండియాల్లోని వైర‌స్‌లు భిన్నంగా ఉన్నాయంటున్నారు. రూపం మార్చుకుంటూ మాన‌వాళిపై దాడి చేస్తున్నాయంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతున్నారు. వైద్యులు, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు.. ఇలా సామాజిక సేవ‌లో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న వ‌ర్గాల‌న్నీ వైర‌స్ బారీన‌ప‌డుతూ.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వాల వైఖ‌రిపై న్యాయ‌స్థానాలు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నాయి.

ప్ర‌కృతి కోపానికి ఫ‌లితం అనుభ‌విస్తున్న జ‌నం..అదే ప్ర‌కృతి శాంతించేంత వ‌ర‌కూ ఏమీ చేయ‌లేమంటూ ప్ర‌భుత్వాలు కూడా పై వాడినే న‌మ్ముకుంటున్నాయి. ఏమైనా క‌రోనా వైర‌స్ ఎన్నిర‌కాలు.. అస‌లు చైనాలో వెలుగుచూసిన వైర‌స్‌కు ఇండియాలో విస్త‌రిస్తున్న కొవిడ్ 19కు బేధాలు ఏమిట‌నేది ఇప్ప‌టికీ ప‌రిశోధ‌కుల‌కు అంతుబ‌ట్ట‌ని ప్ర‌శ్న‌గా మారింది. ఇలా.. రూపం మార్చుకుంటూ దొంగాట ఆడుతున్న వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌టం నిజంగా మాన‌వాళి ముందుకు పెనుస‌వాల్ అనేది ప‌రిశోధ‌కులు చెబుతున్న వాస్త‌వం.

You might also like

Leave A Reply

Your email address will not be published.