విజయవాడ: నగరంలో దొంగబాబా అచ్చిరెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. రూ.1 కోటి తీసుకుని నగ్న పూజలు చేయించాడని ఒక మహిళ నల్లగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదును పరిశీలించిన నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. వాస్తవమేనని తేలడంతో కోర్టు ద్వారా అరెస్టు వారంట్ జారీ చేయించారు. అయితే పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అచ్చిరెడ్డిని ఎట్టకేలకు ఇవాళ తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబా కుమారుడు వంశీ రెడ్డి విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యదర్శి గా పనిచేస్తున్నాడు. త్రిశక్తి జ్యోతిష్యాలయం పేరుతో అచ్చిరెడ్డి అనేక మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.