FbTelugu

వాళ్లు ఏ ప్రణాళికనూ తీసుకురాలేదు: లోకేశ్

అమరావతి: టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అతి త్వరలో ఏపీ పంచాయతి ఎన్నికలు జరగనున్న తరుణంలో.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ మేనిఫెస్టోని విడుదల చేశాడు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించడం పట్ల.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్పందించారు.

‘‘పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలకు మేనిఫెస్టో ఏంటి అని కొందరు మాట్లాడుతున్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ల‌లో పల్లెల అభివృద్ధికి అంటూ ఏ ప్రణాళికా తీసుకురాలేక పోయారు. ఆ పని ఇప్పుడు తెలుగుదేశం చేసింది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపిస్తే పల్లె ప్రగతి ఏ రకంగా సాధ్యం చేసి చూపిస్తారో చెప్పే ప్రణాళిక ఇది. పల్లె ప్రగతికి పంచ సూత్రాలను రూపొందించడం జరిగింది.’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.