FbTelugu

దేశంలోనే వీరు ఉత్తమ కలెక్టర్లు

ప్రముఖ సంస్థ ఫేమ్ ఇండియా దేశ వ్యాప్తంగా చేసిన సర్వేలో దేశంలోనే 50 మంది ఉత్తమ ఐఏఎస్ అధికారులను ఎంపిక చేసింది.

ఈ టాప్ 50 లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారిలో ఒకరు రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ కాగా, ఇంకొకరు కరీంనగర్ కలెక్టర్ శశాంక. ఫేమ్ ఇండియా సంస్థ వీరిద్దరి గత 4 నెలల పనితనం ఆధారంగా ఈ జాబితాకు ఎంపిక చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా ఈ రెండు జిల్లాల కలెక్టర్లు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండి ఆయా జిల్లాల్లో ప్రజల్లో వ్యాధి పట్ల చైతన్యం తెస్తూ జిల్లా అంతటా తగిన జాగ్రత్తలు పాటించేలా కఠిన చర్యలు తీసుకున్నారు.

ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కరోనా కట్టడికి వినూత్న పద్దతులను అవలంభించారు. ట్రేస్, టెస్ట్, ఐసొలేట్, సపోర్ట్ అనే విధానాన్ని రంగారెడ్డి జిల్లా అంతటా అమలు చేసి ఎక్కడికక్కడ కరోనా కేసు నమోదు అయినా ప్రాంతాన్ని ఐసొలేట్ చేసి ఆ ప్రాంతంలో ఆ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను ట్రేస్ చేసి వారిని ఐసొలేట్ చేసి వారికి అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తూ మళ్ళి వారికి టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన కేసులను ఆసుపత్రికి తరలించారు.

ఆ పాజిటివ్ కేసులు వచ్చిన వారితో సంబంధమున్న వ్యక్తులను ట్రేస్ చేసి ఆ సంబంధీకులను కూడా క్వారంటైన్ చేశారు. ఇలా క్రమం తప్పకుండా జిల్లా యంత్రాం గాన్ని ఇదే పద్దతిలో  పనిచేసే విధంగా వారిని సమాయత్తం చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణకి కీలక ఆర్ధిక వనరులను అందించే ఐటి పరిశ్రమ ఉండటంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండటంతో పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతమంతా కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ, జిల్లా అంతటా వలస కార్మికుల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నారు. అందుకే దేశ ఉత్తమ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిగా ఎంపికయ్యారు.

You might also like