FbTelugu

దర్యాప్తుకు దొరకకుండా కొత్త ప్రదేశం వెతుకుతున్నారు: విజయసాయి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా సెటైర్ల వర్షం కురిపించారు. లాక్ డౌన్ లో అత్యంత సురక్షితమైన ప్రదేశం హైదరాబాద్ అని అక్కడే ఇన్ని రోజులు తండ్రీ కొడుకులు తలదాచుకున్నారని అన్నారు.

ఇప్పుడు దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఉండేందుకు చంద్రబాబు, లోకేష్ కొత్త ప్రదేశాన్ని వెతుక్కుంటున్నారంటూ ట్వీట్ చేశారు. ఈఎస్ఐ స్కాం లో అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.