FbTelugu

ఈ అంకెలు చూస్తే బాబుకు అర్థమౌతుంది: విజయసాయి

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు చేశారు.

జగన్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు 68.18 శాతం కేటాయించిందని, ప్రతిదాన్ని కులానికి లింకు పెట్టే చంద్రబాబు ఒకసారి ఈ అంకెలను చూస్తే అర్థమౌతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వ పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. కులాలను రెచ్చగొట్టి ఆ హింసాగ్నిలో చలికాచుకునే చరిత్ర చంద్రబాబుదన్నారు.

You might also like