FbTelugu

న్యూఇయర్ వేడుకల మార్గదర్శకాలు ఇవే

హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించిన ప్రభుత్వం, పోలీసులు మార్గదర్శకాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎలాంటి కర్ఫ్యూ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు ఉంటాయని తెలిపింది. రాత్రి 12 గంటల వరకు పబ్బులు, రెస్టారెంట్లకు అనుమతించినట్టు తెలిపింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈవెంట్లు, ఫ్లోర్ డ్యాన్స్, రిస్సార్ట్స్ లో వేడుకలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.