FbTelugu

హైదరాబాద్ లో మతకల్లోలాలే ఉండేవి: పోసాని

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజధాని హైదరాబాద్ అంటే గతంలో మతకల్లోలాలే గుర్తొచ్చేవని.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అలాంటి పరిస్థితి లేదని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా తాను హైదరాబాద్ లో ఉంటున్నానని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సమూల మార్పులు వచ్చాయని తెలిపారు. గతంలో ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం ఉండేది కాదని.. ప్రస్తుతం అంతా పచ్చగా మారిపోయిందని అన్నారు.

కేసీఆర్ వస్తే ఆంధ్ర వారిని తరిమి కొడతారని అప్పట్లో ప్రచారం జరిగేదని.. కానీ తెలంగాణ వచ్చాక ఏ ఒక్క ఆంధ్ర వారి మీద దాడి జరిగిన ఘటనలు లేవన్నారు. నాలాలను ప్రజలే ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని అందుకే వరదలని అన్నారు. ఆంధ్ర నాయకులు ఇక్కడి నుండి వెళ్ళిపోయాక తెలంగాణలో కరెంట్ పోవడం అనేది చాలా అరుదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.