FbTelugu

వ్యాక్సిన్లకు కొరత లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో వ్యాక్సిన్లకు కొరత లేదని, వ్యాక్సిన్ తరలింపులో లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.

ప్రజల భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారిపై విజయం సాధించలేమని ఆయన అన్నారు. ఇవాళ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోవిషీల్డు, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని, మన దేశంతో పాటు 58 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా అవుతుందని ఆయన తెలిపారు. మన దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు అవకాశం మేరకు ఉన్నన్ని డోసులు అందుబాటులో పెడుతున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కోవాగ్జిక్ తీసుకోగా, నేను కోవిషీల్టు తీసుకున్నాను, ఏ వ్యాక్సిన్ అయినా ఒకటేనని, బాగా పనిచేస్తున్నాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.