FbTelugu

జిల్లాల్లో పీపీఈ కిట్లకు కొరత లేదు: హరీష్ రావు

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పీపీఈ కిట్లు, మందులకు కొరత లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన టెలీ కాన్ఫరెన్స్ లో పలు విషయాలను వెల్లడించారు. కిట్లు లేవన్న సాకులు చెప్పొద్దని అన్నారు.

ప్రతిరోజూ పీహెచ్ సీలలో కరోనా టెస్టులు నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా రోగులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు.

You might also like