FbTelugu

కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ లేదు: డా.శ్రీనివాస్

హైదరాబాద్: తెలంగాణ లో ఎక్కడ కూడా కరోనా పాజిటివ్ కమ్యునిటీ ట్రాన్స్ మిట్ జరగలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. ఇవాళ కోఠి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

లాక్ డౌన్ సమయంలో ఎక్కడికి వెళ్లవద్దు అని చెప్పినా కొన్ని తప్పిదాల వల్ల కేసులు భారీగా పెరిగాయన్నారు. అవి ఏంటో గమనిస్తే… బోరబండ లో ఓ యువకుడి ద్వారా 14మందికి పాజిటివ్ వచ్చింది. ఒక బర్త్ డే పార్టీ ద్వారా చాలా మందికి వచ్చిందని, 82 మంది ఇబ్బంది పడ్డారన్నారన్నారని డా.శ్రీనివాస్ తెలిపారు.

ఆఖరికి ఒడి బియ్యం ద్వారా కూడా వచ్చిందని ఆయన వివరించారు. లాక్ డౌన్ నిర్లక్ష్యం చేసిన ప్రదేశాల్లో కేసులు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో కరోనా తో సహజీవనం చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సర్వై లైన్స్  సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారిని పరిశీలిస్తున్నామన్నారు.

గత మూడు నెలలు గా కోవిడ్-19 అరికట్టడానికి అన్ని డిపార్ట్ మెంటులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. నాలుగు లాక్ డౌన్ లకు ప్రజలు సహకరించారు. ఇప్పటి వరకు తెలంగాణ లో 2008 నమోదు కాగా, ఫారిన్ కేసులు 30 ఉన్నాయి. నిజాముద్దీన్ మర్కజ్ కేసులు అధికంగా వచ్చాయన్నారు.

లాక్ డౌన్ సడలింపుల తరువాత వలస కార్మికులు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు రావడం వల్ల ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వేరే దేశం వాళ్ళు రావడం వల్ల మరిన్ని కేసులు పెరిగాయన్నారు. తెలంగాణ లో కోటి కుటుంబాలు ఉంటే కేవలం 546 కుటుంబాలు మాత్రమే వైరస్ వల్ల ఇబ్బంది పడ్డాయని వివరించారు. 4వ లాక్ డౌన్ లో 1005 పాజిటివ్ కేసులు వచ్చాయి.  దీని ద్వారా 470 కుటుంబాల పై ప్రభావం పడిందని డా.శ్రీనివాస్ తెలిపారు.

కరోనా కు మూడు ముఖ్యమైన సూత్రాలు..

1.ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి

2.భౌతిక దూరం పాటించాలి

3.వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం

You might also like

Leave A Reply

Your email address will not be published.