FbTelugu

ఇక్కడ రాజ్యాంగం, రూల్స్, రెగ్యులేషన్స్ లేవు: జేసీ

అమరావతి: రాజ్యాంగం, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ లేవంటూ.. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ ప్రభుత్వంలో నిరసన తెలపడం బుద్దిలేని పని అని అన్నారు.

అధికారులందరికీ నడుములు విరిగిపోయాయని అన్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల మాటలు చెల్లవని అన్నారు. ఏపీ సీఎం జగన్ కు ఏ దేవుడూ లేడని అన్నారు. అతను ఎవరి మాటా వినడని, అతనికి ఎదురు చెప్పే వారే ఉండకూడదని అన్నారు. ఈ నాలుగేళ్లు ఎవరికేం జరుగుతుందో తెలియదన్నారు. మనం ఇప్పుడు ఏమీ అనలేమని, ఏమైనా ఉంటే నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తేల్చుకోవచ్చని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.