అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి చేపట్టడంపై స్పష్టత లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయదని ప్రజలు భావిస్తున్నట్టు తెలిపారు. నిమ్మగడ్డ పదవి నుంచి దిగిపోయాడని చంద్రబాబు రెండు డజన్ల మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై అనవసర రాద్దాంతం చేస్తున్నాడని అన్నారు.