FbTelugu

రెండో రాజధాని పై చర్చ జరుగుతోంది: మాజీ గవర్నర్

There-is-debate-over-the-second-capital-says-former-governor

అంబేడ్కర్ ఆనాడే ఆలోచించారు

హైదరాబాద్: దేశంలో రెండో రాజధానిగా హైదరాబాద్ కావాలన్న చర్చ చాలారోజుల నుండి నడుస్తోందని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నాయకులు సీహెచ్. విద్యాసాగర్ రావు అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్. అంబేడ్కర్ రెండో రాజధాని హైదరాబాద్ అని ఆనాడే చెప్పారు. దేశంలో రెండవ రాజధాని అయితే హైదరాబాద్ బెటర్ గా ఉంటుందన్నారు. ఆనాడు అంబేడ్కర్ చెప్పిన అంశాన్నే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. దీని కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ రెండవ రాజధాని అయితే బాగుంటుందని బీజేపీ కూడా అభిప్రాయ పడుతుందన్నారు. అందరూ కలసి కట్టుగా ఆలోచన చేస్తే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అంశం సులభం అవుతుందన్నారు.

మహారాష్ట్ర లో బీజేపీ, శివసేన పార్టీలు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేశాయన్నారు. నైతికంగా బీజేపీ,శివసేన రెండు కలిసి ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేయాలన్నారు. శివసేన బీజేపీకి మద్దతు ఇస్తుంది అని భావిస్తున్నామన్నారు. లేదంటే సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీ కి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక నుంచి తెలంగాణ బీజేపీలో క్రియాశీలకంగా ఉంటానని చెప్పారు. అందుకోసం జాతీయ నాయకత్వం నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సరేనని విద్యాసాగర్ రావు అన్నారు.

You might also like