FbTelugu

అమెరికా ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఎంట్రీ ఉంది

వాషింగ్టన్: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ తీసుకున్నవారికి ఇక నుంచి అమెరికాలో ప్రవేశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవాగ్జిన్ గుర్తించకపోవడంతో అమెరికా నిషేధించింది.

ఈ వ్యాక్సిన్ వేసుకున్నవారు అమెరికా కు రావచ్చని తెలపడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ డోసు ధరల తగ్గింపుపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసుకు రూ.150 మాత్రమే తీసుకుంటున్నామని, ప్రైవేటు హాస్పిటల్ కు రూ.990 కు విక్రయిస్తున్నామని తెలిపింది. ప్రైవేటు రంగంలో తగ్గించాలనే డిమాండ్ ను తోసిపుచ్చింది. దీర్ఘకాలం తక్కువ ధరకు డోసు సరఫరా చేయడం కుదరని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.