FbTelugu

విద్యుత్ అంతరాయాలకు యాప్ ఉంది…

హైదరాబాద్: కరెంటు అంతరాయాలే కాకుండా సరఫరా కు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు టి.ఎస్.ఎస్.డి.సి.ఎల్ యాప్ ను వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ కోరుతోంది.

వర్షాలు పడి కరెంటు ఆగిపోయినా, విద్యుత్ స్థంభాలు పడిపోయినా, సర్వీసు లో లోపాలు ఉన్నా యాప్ ను వినియోగించుకోవడం మేలని అంటున్నారు. ఫిర్యాదుల కోసం ప్రస్తుతం 1912 కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏక కాలంలో 60 మంది వినియోగదారులకు మించి మాట్లాడే పరిస్థితి లేదు. ఒక్కోసారి మూడు వేలకు మించి కాల్స్ రావడంతో లైన్లు బిజీ అనే సమాధానం విన్పిస్తుంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ప్రస్తుతం ఉన్న టి.ఎస్.ఎస్.డి.సి.ఎల్ యాప్ ను ఆధునీకరించారు. కాల్ చేయడం బదులు యాప్ లో ఫిర్యాదు చేస్తే సరిపోతుందని అంటున్నారు. యాప్ లో యూనిక్ సర్వీసు నెంబర్, మొబైల్ నెంబర్ ముందుగానే రిజిష్టర్ అయి ఉంటాయి. కన్జూమర్ సర్వీస్ నెంబర్ నెంబర్ నొక్కగానే నో పవర్ కంప్లైంట్ ఉంటుంది. దీనిపై నొక్కితే యూనిక్ సర్వీస్ నెంబర్, పేరు కన్పిస్తుంది. వెంటనే సబ్ మిట్ నొక్కితే ఫిర్యాదు నమోదు అవుతుంది. ప్రతి ఒక్కరు యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే కాల్ సెంటర్ పై ఒత్తిడి తగ్గుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.