FbTelugu

తనకు ప్రాణ హాని ఉంది: ఎంపీ రాజు

వైసీపీ ఎమ్మెల్యేలపై రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు

ప.గో.జిల్లా: నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణమ రాజు తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన దిష్టిబొమ్మలను దగ్ధం చేసి తనకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు వివరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై కేసు నమోదు చేయవలసిందిగా తన ఫిర్యాదులో కోరారు. గత కొద్ది నెలలుగా ఎంపీ సీఎం జగన్ వైఖరి, వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారం రోజులుగా మాటల యుద్ధం పెరగడంతో ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.