FbTelugu

చెట్లకు దవాఖాన ఉంది తెలుసా?

చండీగఢ్: మనుషులకు దవాఖనాలు సర్వసాధారణం. జంతువులకు దవాఖానాలు ఉండడం కూడా తెలిసిందే. కొత్తగా చెట్లకు ఒక దవాఖాన వచ్చింది. సమస్త జీవకోటికి ఆయువుగా ఉన్న చెట్లకు ఒక వ్యక్తి హాస్పిటల్ పెట్టాడు.

అది ఎక్కడో కాదు పంజాబ్ రాష్ట్రంలోనే. అమృత్ సర్ లో నివసించే ఐఆర్ఎస్ అధికారి రోహిత్ మెహ్రా దేశానికి సుపరిచితం. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల మొక్కలు నాటించి పర్యవరణ పరిరక్షకుడిగా పేరొందారు. దేశంలో వర్టికల్ గార్డెన్స్ ను ప్రోత్సహించింది గ్రీన్ మ్యాన్ ఆప్ ఇండియా పేరు సంపాదించుకున్నారు. ఇళ్లలో పెంచుకునే చెట్లకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరోగం వస్తునే టుంది. ఫలితంగా ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. సాధారణ ఇళ్లలో పెంచకునే వాటికి ఎవరూ కూడా ముందుకు రారు. సామాన్యుల కోసం ఒక దవాఖానాను రోహిత్ ప్రారంభించారు. ఇళ్లలో పెంచుకునే చెట్లకు ఏ వ్యాధి సోకినా తనను సంప్రదిస్తే నయం చేస్తున్నాడు. దీని కోసం ఒక అంబూలెన్స్ కూడా ఏర్పాటు చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.