FbTelugu

ప్రత్యేక రైలులో 9 మందే ప్రయాణీకులు

చెన్నై: కరోనా సమయంలో అత్యవసరం అయితే తప్ప రైలు ఎక్కేందుకు జనం భయపడుతున్నారనే దానికి ఈ రైలు ఉదాహరణ మాత్రమే. కోయంబత్తూర్ నుంచి చెన్నైకు బయలుదేరిన రైలులో కేవలం 9 మంది ప్రయాణించారు.

లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత ఈ నెల 5న రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌ నుంచి చెన్నైకు 16 బోగీలతో ప్రత్యేక రైలు నడిపారు. కరోనా భయంతో కేవలం 9 మంది మాత్రమే ఇందులో ప్రయాణించడంతో డీజీల్ ఖర్చులు కూడా రాలేదు. వారిలో జేఈఈ మెయిన్స్‌ కు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రయాణించారు. వీరందరికీ రైల్వేస్టేషన్‌లో థర్మల్‌ స్కాన్‌ పరీక్షలు నిర్వహించి అనుమతించారు. ఈ రైలు ఆదివారం ఉదయం 6 గంటలకు చెన్నైకి చేరుకుంది.

You might also like